ఐఏఎస్ ఆఫీసర్‌‌కి జీతం ఎంతో వస్తుందో తెలుసా..?

దేశంలో అత్యంత గౌరవప్రదమైన ఉద్యోగాలలో IAS టాప్ ప్లేసులో ఉంటుంది. 

అందుకే, చాలా మంది ఈ పోస్టుల కోసం పోటీ పడుతుంటారు. 

మరి, ఐఏఎస్‌ ఆఫీసర్లకు బేసిక్ శాలరీ ఎంత ఉంటుంది? 

ఐఏఎస్ ఆఫీసర్ స్టార్టింగ్ బేసిక్ శాలరీ నెలకు రూ.56,000 ఉంటుంది. 

గరిష్ఠంగా రూ.2,50,000 అందుతుంది. 

పే లెవెల్స్ ప్రకారం ఈ బేసిక్ శాలరీని ఫైనల్ చేస్తారు. 

పే లెవెల్ 10 కింద రూ.56 వేలు ఉండగా, పే లెవెల్ 18లో రూ.2,50,000 ఉంటుంది. 

బేసిక్ పే రూ.56 వేలు అయితే.. డీఏ రూ.21,318 అందుతుంది. 

హెచ్‌ఆర్‌ఏ రూ.13,464, ట్రావెల్ అలవెన్స్ రూ.3,600.. 

మొత్తం నెలకు రూ.94,482 జీతం అకౌంట్‌లో పడుతుంది.