ప్రపంచ దేశాల్లో మనుషుల సగటు జీవిత కాలం ఎంత?
ఐక్యరాజ్యసమితిలోని పాపులేషన్ అండ్ స్టాటిస్టికల్ డివిజన్స్ 2021 నాటి లెక్క ప్రకారం సగటు జీవిత కాలం ఇలా ఉంది.
ప్రపంచంలో ఎక్కువ సగటు జీవితకాలం హాంకాంగ్ కలిగి వుంది. అక్కడ యావరేజ్‌గా 85 ఏళ్లు బతుకుతున్నారు.
హాంకాంగ్ తర్వాత మకావోలో కూడా సగటున 85 ఏళ్లు జీవిస్తుండగా.. జపాన్‌లో 84 ఏళ్లు బతుకుతున్నారు.
దక్షిణ కొరియా, స్విట్జర్లాండ్‌లో 84 ఏళ్లుగా ఈ సగటు జీవిత కాలం ఉంది.
సింగపూర్, నార్వే, ఆస్ట్రేలియా, స్పెయిన్, ఐస్లాండ్, స్వీడన్, కెనడా, ఇటలీలో 83 ఏళ్లు జీవిస్తున్నారు.
ఫిన్లాండ్, ఫ్రాన్స్, ఐర్లాండ్‌లో ఈ సగటు జీవిత కాలం 82 ఏళ్లుగా ఉంది.
నెదర్లాండ్స్, ఆస్ట్రియా, డెన్మార్క్, జర్మనీ, బ్రిటన్‌లో 81 ఏళ్లుగా సగటు జీవిత కాలం ఉంది.
చిలీ, UAEలో 79 ఏళ్లు, చైనా, సౌదీ అరేబియాలో 77 ఏళ్లు, అమెరికా, టర్కీ, పోలాండ్‌లో 76 ఏళ్లుగా తేల్చారు.
అర్జెంటినాలో 75 ఏళ్లు, హంగేరీ, ఇరాన్లో 74, బ్రెజిల్, సెర్బియాలో 73, బంగ్లాదేశ్‌లో 72 ఏళ్లుగా తెలిపారు.
వెనెజులాలో 71, ఈజిప్ట్, మెక్సికోలో 70, రష్యాలో 69, ఇండొనేసియాలో 68 ఏళ్లుగా లెక్కించారు.
ఇండియాలో సగటు జీవిత కాలం 67 సంవత్సరాలుగా ఉండగా, పాకిస్థాన్‌లో ఇది 66 ఏళ్లుగా ఉంది.
ఇథియోపియాలో 65, సౌత్ ఆఫ్రికా, ఆఫ్ఘనిస్థాన్, నైగర్‌లో 62, సోమాలియాలో 55, నైజీరియాలో 53 ఏళ్లుగా తేల్చారు.
More
Stories
కర్పూరాన్ని ఇలా వాడితే... ఆ ఇంట కనక వర్షమే.
బరువు తగ్గేందుకు సరైన ఫార్ములా
లక్కీ నంబర్స్