ఏ వయసులో ఏ ఆహారం తినాలి?

పండ్లు, కూరగాయలు : వయసుతో సంబంధం లేకుండా పండ్లు, కూరగాయల్ని అన్ని వయసుల్లోనూ తీసుకోవాలి.

ఒమేగా 3 : దీన్ని అన్ని వయసుల్లో పొందాలి. ఇది చేపల్లో లభిస్తుంది. బ్రెయిన్, కళ్లు, గుండెకు మంచిది. కీళ్లనొప్పులు తగ్గిస్తుంది.

కాల్షియం : పిల్లలు, పెద్దలు, మహిళలకు కాల్షియం చాలా అవసరం. ఇది లభించే పాలు, వెన్న, జున్ను, పెరుగు, ఆకుకూరల్ని బాగా తీసుకోవాలి.

0-2 ఏళ్లు : ఈ వయసులో ఆకుకూరలు, గుడ్లు, పాల పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి.

2-టీనేజ్ : ఈ వయసులో గింజలు, వెన్న, పాల పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి. వీటిలో ఐరన్, కాల్షియం పిల్లలకు చాలా అవసరం.

యంగ్ ఏజ్ : యుక్త వయస్సులో పప్పులు, డ్రై ఫ్రూట్స్, పోషకాలు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి. ఐరన్ రిచ్ ఫుడ్ తినాలి.

20 ఏళ్లు : విటమిన్ బి గ్రూప్ ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవాలి. తృణధాన్యాలు, ఆకుకూరలు, కూరగాయల్ని ఎక్కువగా తినాలి.

30 ఏళ్లు : బార్లీ, ఓట్స్, బ్రౌన్ రైస్, తృణధాన్యాలు, ముదురు రంగులోని ఆకు కూరలు తినాలి. ఫైబర్ ఎక్కువగా ఉండేవి తీసుకోవాలి.

40 ఏళ్లు : మెరిసే రంగుల్లోని పండ్లు, కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలి. తద్వారా త్వరగా ముసలితనం రాకుండా చేసుకోవచ్చు.

50 ఏళ్లు : ఈ వయసులో ఆలివ్ ఆయిల్ ఎక్కువగా వాడాలి. జున్ను, వెన్న వంటివి తగ్గించాలి. చెడు కొవ్వు పెరగకుండా చూసుకోవాలి.

60 ఏళ్లు : 60 ఏళ్ల వయసులో ప్రోటీన్ ఉండే ఆహారం ఎక్కువ తీసుకోవాలి. కండరాలు బలంగా ఉండేలా చూసుకోవాలి.

70 ఏళ్లు : ఈ వయసులో ఆహారంలో అన్ని రకాలూ ఉండేలా చూసుకోవాలి. అన్ని పోషకాలూ అందేలా వండుకోవాలి.