ప్రపంచంలో ఎక్కువ కాలం జీవించేవి ఇవే..?
ఉప్పునీటి మొసళ్ళు సాధారణంగా 70 సంవత్సరాలకు పైగా జీవిస్తాయి. కొన్ని మొసళ్లు 120 సంవత్సరాలకు పైగా జీవించి ఉన్నాయి.
తాబేళ్లు 190 ఏళ్లకు పైగా జీవిస్తాయి. సాధారణంగా వీటి జీవిత కాలం 200 ఏళ్లు ఉంటుంది.
ఎర్ర సముద్రపు అర్చిన్లు ముల్లతో కప్పబడి ఉన్న చిన్న, గుండ్రని అకశేరుకాలు. ఇవి 100 సంవత్సరాలకు పైగా జీవిస్తారు.
బౌహెడ్ తిమింగలాలు ఎక్కువ కాలం జీవించే క్షీరదాలు. ఇవి 100 నుంచి 200 సంవత్సరాలకు పైగా జీవిస్తాయి.
రఫ్ఐ రాక్‌ఫిష్ అత్యంత ఎక్కువ కాలం జీవించే చేపలలో ఒకటి. దీని గరిష్ట జీవిత కాలం 205 సంవత్సరాలు.
మంచినీటి పెర్ల్ మస్సెల్స్ నీటి నుంచి ఆహారాన్ని సేకరిస్తాయి. అత్యంత పురాతనమైన మంచినీటి పెర్ల్ మస్సెల్ 280 సంవత్సరాల వయస్సు.
గ్రీన్లాండ్ సొరచేపలు ఆర్కిటిక్, ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రాలలో లోతులో నివసిస్తాయి. ఈ సొరచేపలు గరిష్టంగా 272 సంవత్సరాల జీవితకాలం కలిగి ఉంటాయి.
ట్యూబ్ వార్మ్‌లు అకశేరుకాలు, ఇవి సముద్రపు అడుగుభాగంలో నివసిస్తాయి. ఇవి 200 నుంచి 300 సంవత్సరాలకు పైగా జీవించి ఉంటాయి.
జెయింట్ బారెల్ స్పాంజ్లు 2,000 సంవత్సరాలకు పైగా జీవించగలవు.
"ఎండోలిత్స్" అనే బాక్టీరియా 10వేల సంవత్సరాలు జీవిస్తుంది.
(గమనిక: ఈ ఆర్టికల్‌లో ఇచ్చినది ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్లో సోషల్ సమాచారం మాత్రమే. దీన్ని తెలుగు న్యూస్ 18 నిర్ధారించట్లేదని గమనించగలరు.)
More
Stories
రూ.50వేల పెట్టుబడితో వ్యాపార ఐడియా
యాపిల్స్ ఎక్కువగా తింటే.. ప్రమాదమే!
పుచ్చకాయ రహస్యాలు