పరమేశ్వరుడికి నచ్చే 9 పూలు ఇవే!

శివుడికి పత్రాలు, పూలంటే చాలా ఇష్టం. మరి భక్తులు ఇష్టంగా సమర్పించే 9 పూలు ఏవో తెలుసుకుందాం.

Bael - శివుడికి మారేడు పువ్వులంటే చాలా ఇష్టం. ఈ ఒక్క పువ్వు.. 1000 పువ్వులతో సమానం అని భక్తులు భావిస్తారు.

Dhatura (Thorn Apple) - శివుడికి ఉమ్మెత్త పూలంటే చాలా ఇష్టం. ఇవి నెగెటివ్ శక్తులు, మలినాల నుంచి భక్తులను కాపాడతాయి. 

Aak Flowers (Madar) - జిల్లేడు పూలను అత్యంత పవిత్రమైనవిగా భావిస్తారు. శివుడికి సమర్పించినప్పుడు ఇవి భక్తుల ఆత్మను శుభ్రపరుస్తాయని నమ్ముతారు.

Lotus - స్వచ్ఛత, జ్ఞానోదయాన్ని సూచించే తామర పువ్వు, ఆధ్యాత్మిక వృద్ధి, శాంతిని పొందేందుకు తరచుగా శివునికి సమర్పిస్తారు.

Jasmine - తీపి సువాసనకు ప్రసిద్ధి చెందిన మల్లెపూలు స్వచ్ఛత, భక్తిని సూచిస్తాయి. మల్లెపూవును నైవేద్యంగా పెట్టడం వల్ల పరమశివుని ప్రసన్నం చేసుకోవచ్చని చెబుతారు.

Hibiscus - భక్తి కోసం, ప్రతికూల శక్తుల నాశనానికి ప్రతీకగా శివునికి ప్రకాశవంతమైన ఎరుపు మందార పువ్వులు సమర్పిస్తారు.

Cannabis Flowers - శివుడికి ఉండే అఘోర స్వభావంతో సంబంధం ఉన్న గంజాయి పువ్వులు అంతర్గత బలం, ప్రాపంచిక కోరికల నుంచి నిర్లిప్తత కోసం, ఆయన ఆశీర్వాదం కోసం సమర్పిస్తారు.

Chrysanthemum - చామంతి పువ్వులు దీర్ఘాయువు, ఆశావాదాన్ని సూచిస్తాయి. వీటిని శివునికి నైవేద్యంగా సమర్పించడం వలన సంతోషం, శ్రేయస్సు లభిస్తాయని నమ్ముతారు.

Roses - గులాబీలు, ముఖ్యంగా తెలుపు రంగువి, స్వచ్ఛత, ప్రేమను సూచిస్తాయి. శివునికి గులాబీలను సమర్పించడం వల్ల దైవిక ఆశీర్వాదాలు, ప్రశాంతతను పొందవచ్చు.

ఇలా భారతీయులు శివుడికి రకరకాల పూలను సమర్పిస్తూ.. తమ అచంచల భక్తిని చాటుకుంటారు.