శుభవార్త.. ఇకపై వీరికి కూడా గ్యాస్ సిలిండర్‌పై రూ.200 సబ్సిడీ?

కేంద్ర ప్రభుత్వం ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ వాడే వారికి ఊరట కలిగించింది.

ఆగస్ట్ నెల చివరిలో సిలిండర్ ధరను భారీగా తగ్గించేసింది. 

ఏకంగా సిలిండర్ ధర రూ. 200 మేర దిగి వచ్చింది. 

ఏపీ, తెలంగాణలో గ్యాస్ సిలిండర్ ధరలు రూ.960 స్థాయిలో ఉన్నాయి. 

పీఎం ఉజ్వల స్కీమ్ వారికి అదనంగా రూ. 200 సబ్సిడీ వస్తోంది. 

అంటే వీరికి గ్యాస్ సిలిండర్‌పై రూ. 400 తగ్గింపు ఉంది. రూ.760కే సిలిండర్ వస్తోంది. 

ఏపీ, తెలంగాణలో మరికొంత మందికి రూ.200 స్సబిడీ వచ్చే అవకాశం ఉంది.

గతంలో దీపం స్కీమ్ కింద గ్యాస్ కనెక్షన్లు పొందారు. వీళ్లు 85లక్షల మంది ఉంటారు.

దీపం స్కీమ్ కింద గ్యాస్ సిలిండర్ పొందిన వారికి మాత్రం రూ. 200 సబ్సిడీ రావడం లేదు. 

వీరికి సబ్సిడీ అందించాలని టీఎస్ ఎల్‌పీజీ డిస్ట్రిబ్యూటర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కే జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. 

ఇదే విషయాన్ని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డికి తెలియజేశారు. 

కేంద్రం ఈ విషయంలో సానుకూలంగా స్పందిస్తే.. వీరికి కూడా  రూ.200 సబ్సిడీ రావొచ్చు.  

MORE  NEWS...

ఇక ఈ బ్యాంక్ కనిపించదు.. ఆర్‌బీఐ కీలక ప్రకటన

ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ.21 వేల తగ్గింపు

3 ఏళ్లలోనే రూ.15 లక్షలకు పైగా పొందండి