చికెన్ బాగా కడిగి, పసుపు, కొద్దిగా ఉప్పు వేసి పక్కన పెట్టండి. మసాలా దినుసులు డ్రై రోస్ట్ చేసి మెత్తగా రుబ్బుకోవాలి.
తయారీ విధానం..
ఇప్పుడు ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటాలను 5 నిమిషాలు నూనెలో వేయించాలి. ఆ తర్వాత సెపరేటుగా ప్యూరీ సిద్ధం చేసుకోవాలి.
మీడియం వేడి మీద నూనే పోసి, ఉల్లిపాయ పేస్ట్ వేసి సన్నని మంటమీద 5 నిమిషాలు వేయించాలి.
అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు ఉడికించాలి.ఇప్పుడు టమాట ప్యూరీ కూడా వేసి మరో 5 నిమిషాలు వేయించాలి.
ఇప్పుడు రుబ్బిన సుగంధ ద్రవ్యాలు, కారం, చికెన్ జోడించండి. అధిక మంటమీద 10 నిమిషాలు వేయించాలి. అడుగుపట్టకుండా జాగ్రత్త తీసుకోవాలి. ఇప్పుడు మీకు కావాల్సినంత నీరు, ఉప్పు కలిపి చికెన్ బాగా ఉడకబెట్టండి..
చివరగా కొబ్బరిపాలు, నిమ్మరసం, కొంచెం బెల్లం వేసి కలపాలి.పైన కొత్తిమీర చల్లండి. దీన్ని వేడివేడి అన్నం, దోశ, చపాతీలోకి ఆస్వాదించండి..