అబద్ధం చెబితే మీ ముక్కు పట్టించేస్తుంది.. ఎలాగో తెలుసా..? 

జీవితంలో ప్రతి వ్యక్తి  ఖచ్చితంగా ఏదొక విషయంలో అబద్ధాలు చెపుతుంటారు.

ఇదిలా ఉంటే అబద్ధం చెబితే అతికినట్లు ఉండాలి అంటారు పెద్దలు. 

అబద్ధం చెప్పడానికి ప్రయత్నిస్తే మన ముక్కు మనని పట్టించేస్తుంది. 

అబద్ధం చెప్పినప్పుడు మెదడులో ఇన్సులా అనే మూలకం యాక్టివేట్ అవుతుంది. 

ఇది ముక్కు చుట్టూ ఉష్ణోగ్రత పెరగడానికి కారణం అవుతుంది. 

కాటెకోలమైన్ అనే రసాయనాల వల్ల ముక్కులోపల ఉండే కణజాలం ఉబ్బుతాయి. 

ఎవరైనా అబద్ధం చెబుతున్నప్పుడు ఓసారి వారి బాడీ లాంగ్వేజ్ గమనించండి. 

ముక్కుని, ముఖాన్ని చేతులతో పదే పదే తాకడమో చేస్తారు. 

అందువల్ల ఎవరైనా అబద్ధం చెబుతుంటే వారు ముక్కుని ముట్టుకోవడం, గోకడం చేస్తారు. 

ఇక అబద్ధం చెప్పేవారు నిలకడగా నిలబడలేరు. 

అబద్ధాలు చెప్పే వ్యక్తులు నిజం చెప్పే వ్యక్తుల కంటే చాలా తక్కువ పదాల్లో మాట్లాడతారు.