Distance Education: దూరవిద్యలో కొత్త కోర్సులు..
దూర విద్యావిధానంలో ఎన్నో కొత్త కోర్సులు అందుబాటులోకి వచ్చాయి.
వాటిలో ఉద్యోగ, వ్యాపార నేపథ్యంలో చాలా కోర్సులు వివిధ యూనివర్సిటీలు తీసుకొచ్చాయి.
నేరుగా కాలేజీకి వెళ్లి చదవడం వీలు లేని వారికి ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి.
వీరంతా దూరవిద్యను వేదికగా చేసుకుని సత్తా చాటవచ్చు.
వివిధ విశ్వవిద్యాలయాలు వైవిధ్యమైన కోర్సులను ఈ విభాగంలో అందిస్తున్నాయి.
బీబీఏ (జనరల్), బీఏ (జర్నలిజం అండ్ డిజిటల్ మీడియా) కోర్సులు
ఎమ్మెస్సీలో.. జాగ్రఫీ, అప్లయిడ్ స్టాటిస్టిక్స్, జియోఇన్ఫర్మాటిక్స్.
పీజీ డిప్లొమాలో.. పాపులేషన్ అండ్ ఫ్యామిలీ హెల్త్ స్టడీస్, ఎన్విరాన్‌మెంటల్ స్టడీస్, సర్వీస్ మేనేజ్‌మెంట్.
డిప్లొమాలో.. అప్లైడ్ మర్చండైజింగ్ కోర్సులను ఈ ఏడాది జులై సెషన్ నుంచి ప్రారంభించారు.
ఇవి ఇగ్నో, ఏయూ, పాండిచ్ఛేరి యూనివర్సిటీల్లో ఉన్నాయి.