TSPSC: గ్రూప్ 1 ప్రిలిమ్స్ వాయిదా..!

తెలంగాణ గ్రూప్ 1 ప్రిలిమ్స్ కు సర్వం సిద్ధమవుతోంది.

జూన్ 9వ తేదీన ఎగ్జామ్ నిర్వహించనున్న సంగతి తెలిసిందే.

ఇందుకోసం టీఎస్పీఎస్సీ పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తోంది.

హాల్ టికెట్స్ జూన్ 1 నుంచి అందుబాటులోకి తీసుకువచ్చారు.

అయితే గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ను వాయిదా వేయాలని బీఆర్‌ఎస్ నాయకుడు ఆర్‌ఎస్‌ ప్రవీణ్ కుమార్‌ అన్నారు.

అదే రోజున ఇంటెలీజెన్స్‌ బ్యూరో పరీక్ష ఉన్నందున గ్రూప్ 1 పరీక్షను వాయిదా వేయాలని కోరారు.

బీసీ సంక్షేమం సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య కూడా ప్రభుత్వాన్ని వాయిదా వేయలాని డిమాండ్‌ చేశారు.

ఒకే రోజు ఇవన్ని పరీక్షలు ఉన్న దృష్ట్యా గ్రూప్‌ 1 పరీక్షను వాయిదా వేయాలని కోరారు.

ప్రిలిమ్స్ పరీక్ష వాయిదాపై కమిషన్ నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు

టీఎస్పీఎస్సీ 563 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే.