కలలో పాము కాటు వేస్తే ఏమవుతుంది?

కలలో మిమ్మల్ని పాము కాటు వేస్తే, అది మీకు వార్నింగ్ సిగ్నల్ అంటున్నారు మనస్తత్వ వేత్తలు.

కలలో పాము మీ శరీరంపై, ముఖ్యంగా మీ చేతిపై కాటు వేస్తే, దాని అర్థం.. మీరు పెద్ద సమస్యల్లో ఉన్నారని, మీరు బంధీగా ఉన్నారని. 

ఈ కల వస్తే, మీరు ధైర్యం తెచ్చుకోవాలి. పాము చేతిపై కాటు వేస్తే, గాయం అయితే, మీరు మరింత జాగ్రత్తగా వ్యవహరించాలి. 

కలలో పాము, ముఖంపై కాటు వేస్తే దాని అర్థం మీకు అన్ని వైపుల నుంచి నెగెటివ్ ఫలితాలు వస్తున్నట్లే. 

మీ వ్యక్తిగత గుర్తింపు, సమాజంలో పరువుకి భంగం కలిగినట్లేనని ఈ కల చెబుతుంది. 

కలలో పాము, తలపై కాటు వేస్తే ఈ కల మిమ్మల్ని ఆలోచన వైపు నడిపిస్తుంది. అంటే.. మీరు మీ మైనస్ పాయింట్లను గుర్తిస్తారు. 

ఈ కల ద్వారా మీరు అలర్ట్ అవ్వొచ్చు. మీ ప్రస్తుత పరిస్థితులను చక్కదిద్దుకునేందుకు ప్రయత్నించాలి. 

కలలో పాము, భుజంపై కాటు వేస్తే, మీ ఆత్మవిశ్వాసం, గర్వానికి భంగం కలిగినప్పుడు ఇలాంటి కల వస్తుంది.

ఈ కల వస్తే, మిమ్మల్ని మీరు గమనించుకోవాలి. సరైన రూట్‌లో వెళ్తున్నారా అన్నది ఆత్మ పరిశీలన చేసుకోవాలి.

పాములు కూడా ప్రాణులే అయినా, పాము కలలో కాటు వేస్తే.. ఏదో పొరపాటు జరుగుతున్నట్లు గ్రహించి, అలర్ట్ అవ్వాలి.

హేతువాదులు మాత్రం ఇలాంటి వాటిని నమ్మొద్దంటున్నారు. పాము కలలో కాటు వేసినా ఏమీ కాదంటున్నారు.