కలలో పాము కనిపించిందా? ఇలా చెయ్యకపోతే, సమస్యే!
హిందూ పురాణాల్లో లేనిదంటూ ఉండదు. ఏ విషయం పైనైనా ఏదో ఒక సమాచారం వాటిలో ఉంటుంది.
పాములు కలలోకి వస్తే ఏమవుతుంది అనే అంశంపై కూడా సమాచారం ఉందని తెలిసింది.
హేతువాదులైతే ఏమీ కాదంటారు. హిందూ జ్యోతిషశాస్త్రం పాముల గురించి ఏం చెప్పిందో చూద్దాం.
పాము లేదా పాములు కలలోకి వస్తే జీవితంలో మార్పులు, సంతాన భాగ్యం, తెలివితేటలు, దైవ రక్షణ కలుగుతుందని చెబుతున్నారు.
వేద శాస్త్రాల ప్రకారం పాములు విశ్వ శక్తికి నిదర్శనాలు. వాటికి కుండలినీ శక్తి ఉంటంది. అంటే దైవ శక్తి.
పాములు పరమశివుడితో సంబంధం కలిగి ఉంటాయి. పరమేశ్వరుడు తరచుగా పాములను అలంకారంగా ధరిస్తారు.
పాముల కలలు రావడం ఆధ్యాత్మిక మేల్కొలుపు, జ్ఞానం, స్థితిస్థాపకతతో అధిగమించాల్సిన రాబోయే సవాళ్లను సూచిస్తుంది.
అంటే పాము కల వస్తే, మనం అలర్ట్ అవ్వాలి. మంచో, చెడో జరగబోతోందని అర్థం చేసుకోవాలి.
కలలో తాచుపాము కనిపిస్తే దాని అర్థం, మనిషి మనసులో ఏదో భయం ఉందనీ, పరిష్కారం కాని సమస్య ఉందని అనుకోవచ్చు.
కలలో పాము కాటువేసినట్లు కనిపిస్తే, పనిచేసేచోట ద్రోహం లేదా మోసం జరిగినట్లు అర్థం.
మీకు తరచుగా పాముల కలలు వస్తూ ఉంటే, మీ జీవితంలో కొత్త మార్పులు వస్తున్నట్లే. మీరు వాటిని గుర్తించగలగాలి.
Disclaimer: ఇది ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్ సమాచారమే. దీన్ని తెలుగు న్యూస్ 18 నిర్ధారించట్లేదు.
More
Stories
నిద్రలేచాక ఈ దేవుడికి నమస్కరించి, ఈ మంత్రం చదివితే, అదృష్టఫలమే
గ్రీన్ ఫుడ్ తినండి. కలకాలం ఆరోగ్యంగా ఉండండి
వేడి తగ్గించే ఆహారం