Job Notifications: కొత్త ప్రభుత్వంలో కొలువుల జాతర.. 

ఏపీ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మెగా DSCఫైల్ పై సీఎం చంద్రబాబు తొలి సంతకం చేశారు.

ఇందులో భాగంగానే ఇటీవల మంత్రి వర్గం కూడా ఆమోదం తెలిపింది.

గతంలో టీడీపీ హయాంలో 2017-18 మధ్య DSC నోటిఫికేషన్ ఇచ్చిన సంగతి తెలిసిందే.

గత వైసీపీ ప్రభుత్వం హయాంలో ఎన్నికలకు కేవలం 2 నెలల ముందు మాత్రమే DSC నోటిఫికేషన్ రిలీజ్ చేశారు.

దీంతో DSC అభ్యర్థులు ఆందోళన చెందారు.

ఎన్నికల ప్రచారంలో భాగంగా మెగా DSCపై తొలి సంతకం చేసి 16,347 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్స్ రిలీజ్ చేశారు

ఇందులో స్కూల్ అసిస్టెంట్ – 7,725.. ఎస్జీటీ – 6,371 ఉన్నాయి.

టీజీటీ – 1,781.. పీజీటీ – 286, ప్రిన్సిపల్స్ – 52, పీఈటీ – 132 పోస్టులు ఉన్నాయి.

దాదాపు 5 నుంచి ఆరు సంవత్సరాల నుండి ఎలాంటి నోటిఫికేషన్ రాక ఇబ్బందులు ఎదుర్కొన్న DSC అభ్యర్థులకు ఈ ప్రకటన ఊపిరిపోసినట్లయింది.

జీవో 117ను రద్దు చేస్తే మరిన్ని ఉపాధ్యాయ ఖాళీలు వస్తాయని ఉపాధ్యాయ సంఘాలు అంటున్నాయి.