పురుషుల హెయిర్ కట్.. ఏ దేశంలో ఎంత?

పురుషుల హెయిర్ కట్‌కి నార్వేలో అత్యధికంగా రూ.5,336 తీసుకుంటున్నారు.

జపాన్‌లో ఒకసారి జుట్టు కట్ చేయించుకుంటే రూ.4,626 చెల్లించాలి.

మరో యూరప్ దేశం డెన్మార్క్‌లో హెయిర్‌ కట్‌కి రూ.3,982 తీసుకుంటున్నారు.

మరో యూరప్ దేశం స్వీడన్‌లో ఇది రూ.3,811గా ఉంది.

5వ స్థానంలో ఉన్న ఆస్ట్రేలియాలో రూ.3,800 తీసుకుంటున్నారు.

అమెరికాలో సెలూన్‌కి వెళ్తే రూ.3,635 సమర్పించుకోవాలి.

మరో యూరప్ దేశం స్విట్జర్లాండ్‌లో రూ.3,549 ఇవ్వాల్సిందే.

ఫ్యాషన్‌కి పుట్టినిల్లుగా చెప్పే ఫ్రాన్స్‌లో కటింగ్‌కి రూ.3,060 అయిపోతాయి.

అభివృద్ధిలో దూసుకుపోతున్న సౌత్‌ కొరియాలో రూ.3,051 చెల్లించాలి.

ఈ లిస్టులో 10వ దేశంగా ఉన్న ఇంగ్లాండ్‌లో హెయిర్‌కట్‌కి రూ.2,952 అవుతోంది.

ఈ లిస్టులో భారత్ 35వ స్థానంలో ఉంది. ఇండియాలో హెయిర్ కట్‌కి సగటున రూ.437 తీసుకుంటున్నారు.