Anganwadi Teachers: అంగన్వాడీలకు గుడ్ న్యూస్..
తెలంగాణలోని అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లకు ప్రభుత్వం గుడ్ న్యూస్ వినిపించింది.
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 3,989 మినీ అంగన్వాడీలను కేంద్రాలను ప్రధాన అంగన్వాడీ కేంద్రాలుగా మార్చింది.
అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల పదవీ విరమణ వయసును 65 ఏళ్లకు పెంచింది.
ఉద్యోగ విరమణ చేసే అంగన్వాడీ టీచర్లకు రూ.లక్ష ఆర్థిక సాయం చేయనున్నట్లు తెలిపింది.
అదేవిధంగా మినీ అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లకు రూ.50 వేలు ఇవ్వనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.
ఈ మేరకు రాష్ట్రంలో అంగన్వాడీ సిబ్బంది సమస్యలను పరిష్కరిస్తూ దస్త్రంపై సీఎం కేసీఆర్ సంతకం చేశారు.
ఉద్యోగ విరమణ తర్వాత టీచర్లు, హెల్పర్లకు ఆసరా పింఛన్ మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ప్రస్తుతం ఆయాలకు రూ.30 వేలు, టీచర్లకు రూ.50 వేల చొప్పున ప్రోత్సాహకం అందిస్తున్నారు.
ఈ మొత్తాన్ని పెంచాలని అంగన్వాడీ సిబ్బంది ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
ప్రస్తుతం ఉన్న 4 వేల మినీ అంగన్వాడీలను ప్రధాన అంగన్వాడీ కేంద్రాలుగా ప్రభుత్వం అప్గ్రేడ్ చేసింది.
ఈ మేరకు త్వరలో ఉత్తర్వులు జారీ చేయనుంది.