New Course: డిగ్రీలో కొత్త కోర్సు..

భవిష్యత్తులో ఉపాధికి అవసరం అయ్యే కొత్త కోర్సులను  మరిన్ని ప్రవేశ పెడతామని మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు.

డిగ్రీ స్థాయిలో సైబర్ సెక్యూరిటీ కోర్సును మంత్రి సబితా ఇంద్రారెడ్డి నేడు ప్రారంభించారు. 

ఉన్నత విద్యలో మూల్యాంకన పద్ధతులపై సిఫార్సులతో ఐఎస్‌బీ రూపొందించిన నివేదికను మంత్రి విడుదల చేశారు.

బోధన మూస పద్ధతిలో కాకుండా.. మారుతున్న కాలానికి అనుగుణంగా ఆధునికంగా ఉండాలన్నారు.

మూల్యాంకనంపై ఐఎస్‌బీ ఇచ్చిన సిఫార్సులను అధ్యయనం చేసి అమలు చేయాలని విద్యామండలికి సూచించారు.

సైబర్ నేరాలపై విద్యార్థి దశ నుంచే అవగాహన కల్పించాలన్నారు. 

దీనిలో భాగంగానే సైబర్ సెక్యూరిటీ కోర్సును రూపొందించినట్లు ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి తెలిపారు. 

సంప్రదాయ డిగ్రీ కోర్సుల్లో సైబర్ సెక్యూరిటీని ప్రవేశపెట్టారు.