Free Bus: ఫ్రీ ట్రావెల్.. పురుషులకు భారీ శుభవార్త.. 

మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత  ప్రయాణ సౌకర్యాన్ని కల్పించారు.

మహిళలకు ఉచిత ప్రయాణం కారణంగా బస్సుల్లో రద్ధీ విపరీతంగా పెరిగింది.

దీంతో పురుషులకు కనీసం కూర్చునే పరిస్థితి లేకుండా పోయింది.

నిలబడి మాత్రమే బస్సుల్లో ప్రయాణం చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక ప్రకటన చేశారు.

బస్సుల్లో రద్దీ ఉన్నా కూడా.. కూర్చొని ప్రయాణించే సౌకర్యాన్నికల్పిస్తామన్నారు.

దీంతో పురుషులు కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రయాణం చేయవచ్చని తెలిపారు.

పెరిగిన రద్దీ కారణంగా కొత్త బస్సులకు సహకారం అందించేందుకు ప్రభుత్వం సానుకూలంగా ఉందని పేర్కొన్నారు.

తెలంగాణ ఆర్టీసీ పనితీరుపై మంత్రి హైదరాబాద్ లోని బస్ భవన్ లో సమీక్ష నిర్వహించారు.

ఇప్పుడున్న బస్సు సర్వీసుల కంటే కూడా మెరుగైన రవాణా సౌకర్యాన్ని కల్పించాలని అధికారులకు సూచించారు.

అన్ని జిల్లాల నుంచి కూడా హైదరాబాద్ కు బస్సు సౌకర్యాన్ని కల్పిస్తామన్నారు.