పుదీనాను పెంచడానికి నాలుగు నుంచి ఆరు గంటల సూర్యరశ్మి సరిపోతుంది. దీన్ని పెంచడానికి లొకేషన్ కూడా చాలా ముఖ్యం. అంటే దీనికి పాక్షిక ఎండ సరిపోతుంది.
దీనికి కంపోస్ట్ కచ్ఛితంగా వాడాలి. డ్రైనింగ్ సిస్టం సరిగ్గా ఉండేలా చూసుకోవాలి.
12 నుంచి 18 ఇంచులు మొక్క పెరుగుదల ప్రాంతం నుంచి లోతుగా కుండీ ఉండేలా చూసుకోవాలి.
పుదీనా మొక్కను విత్తనాల ద్వారా నాటుకోవచ్చు. కానీ, త్వరగా పెరగాలంటే కట్టింగ్స్ ద్వారా నాటాలి. దీనికి ఆరోగ్యకరంగా ఉండే స్టెమ్ ఎంచుకోండి
పుదీనా మొక్కను ఎప్పుడూ తడిగా ఉండేలా చూడాలి. దీనికి తరచూ నీరు పోస్తూ ఉండాలి. ఎండాకాలం మరింత జాగ్రత్తగా చూసుకోవాలి. కానీ, వాటర్ మరీ ఎక్కువ కాకుండా చూసుకోవాలి.
అంతేకాదు, పుదీనా మొక్క గుబురుగా పెరగాలంటే తరచూ ప్రూన్ చేస్తూ ఉండాలి.
దీనికి ఎక్కువ ఫెర్టిలైజర్స్ అవసరం ఉండదు. వానాకాలంలో ఆల్ పర్పస్ ఫెర్టిలైజర్స్ వేస్తే సరిపోతుంది.
ఈ మొక్కకు స్పైడర్ మైట్స్, యాపైడ్స్ క్రిములు పట్టకుండా ఓ కన్నేసి ఉంచాలి. మీకు ఇవి కనిపిస్తే సంబంధిత క్రిమిసంహాకార మందుతో నియంత్రించండి..
అందుకే ఆర్గానిక్ కంపోస్ట్ వాడటం వల్ల మట్టి ఎప్పుడూ కూడా తడిగా ఉంటుంది. పురుగపట్టకుండా కూడా ఉంటుంది
ప్రతి రెండు నుంచి మూడు సంవత్సరాలకు ఒకసారి వాటిని రీప్లాంట్ చేస్తూ ఉండాలి.