ఎయిర్ హోస్టెస్ నెల జీతం ఎంత?

ఎయిర్ హోస్టెస్ ఉద్యోగం చేయాలనే కల ఎంతో మంది మహిళలకు ఉంటుంది. 

విలాసవంతమైన సదుపాయాలు ఎయిర్ హోస్టెస్ ఉద్యోగం సొంతం.

కేవలం అందంగా ఉంటే ఎయిర్ హోస్టెస్‌గా ఎంపికవుతారని చాలా మంది పొరబడుతుంటారు.

కమ్యూనికేషన్ స్కిల్స్, కొన్ని అర్హతలు ఉన్న వారినే ఈ పోస్టులకు ఎంపిక చేస్తారు. 

ఈ జాబ్ రోల్‌కి అవసరమైన అర్హతలు, జీతం, ఇతర వివరాలు తెలుసుకుందాం. 

భారత్‌లో ఎంట్రీ లెవల్ ఎయిర్ హోస్టెస్ వేతనం రూ. 5 లక్షల నుండి రూ. 9 లక్షల వరకు ఉంటుంది. 

మూడేళ్ల అనుభవం ఉన్న వారి నెల జీతం రూ. 1.5 లక్షల వరకు ఉంటుంది. 

ఎయిర్ హోస్టెస్‌లకు ట్రావెల్ అలవెన్సులు, హెల్త్ ఇన్సూరెన్స్ వంటి అనేక ప్రయోజనాలు అందిస్తాయి.

ఎయిర్ హోస్టెస్ ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహించి, టాలెంట్ ఉన్న వారిని ఎంపిక చేసుకుంటాయి. 

అభ్యర్థులు కనీసం అర్హతగా ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి.