ప్రపంచంలో ఆర్థికంగా స్థిరమైన దేశాలు. ఇండియా స్థానం ఎంతో తెలుసా?

యూఎస్ న్యూస్ అండ్ వరల్డ్ రిపోర్ట్ ప్రకారం స్విట్జర్లాండ్ ఆర్థికంగా అత్యంత స్థిరమైన దేశంగా ఉంది. 

స్విట్జర్లాండ్ తర్వాతి స్థానంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) నిలిచింది.

మూడో స్థానంలో కెనడా, 4వ స్థానంలో జర్మనీ, 5వ స్థానంలో జపాన్ ఉన్నాయి.

6వ స్థానంలో స్వీడన్, తర్వాత ఆస్ట్రేలియా, నెదర్లాండ్స్, నార్వే నిలిచాయి.

10వ స్థానంలో యూరప్ దేశం డెన్మార్ ఉండగా.. 11లో సౌదీ అరేబియా నిలిచింది.

12లో చైనా, 13లో బ్రిటన్, 14లో ఆస్ట్రియా, 15లో ఫిన్‌లాండ్ ఉన్నాయి.

ఈ లిస్టులో అమెరికా 17వ స్థానంలో నిలవగా, సింగపూర్ 18వ పొజిషన్‌లో ఉంది. 

దక్షిణ కొరియా 19వ స్థానంలో, ఫ్రాన్స్ 23వ స్థానంలో ఉన్నాయి. 

ఇటలీ 27వ స్థానంలో ఉండగా, ఇజ్రాయెల్ 29, రష్యా 30వ స్థానంలో నిలిచాయి.

ఆర్థికంగా స్థిరమైన దేశాల జాబితాలో ఇండియా 42వ స్థానంలో ఉంది.

ఈ జాబితా ప్రకారమైతే, చైనా కంటే ఇండియా 30 స్థానాలు వెనక్కి ఉంది.