కూతురిలా కనిపిస్తున్న తల్లి!

ఆమె పేరు లోకాకి. వృత్తి రీత్యా మోడల్. టిక్‌టాక్‌లో 55 లక్షల మంది ఫాలోయర్స్ ఉన్నారు. 

ఆమె వయసు 45 ఏళ్లు అయినా, చూడటానికి మాత్రం అలా కనిపించదు. పాతికేళ్ల యువతిలా కనిపిస్తుంది.

లోకాకి 1979లో పుట్టగా.. ఆమె కూతురు 2009లో పుట్టింది. అందువల్ల ఆమె వయసు 15 ఏళ్లు. 

వీరిలో ఎవరు తల్లో, ఎవరు కూతురో గుర్తించలేని విధంగా ఉన్నారు. తల్లే కూతురిలా కనిపిస్తోంది.

ఈ తల్లీ కూతురు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు.

ముఖ్యంగా తల్లిని చూసి నెటిజన్లు షాకవుతున్నారు. ఆమె ఏజ్ సీక్రెట్ ఏంటి అని ప్రశ్నిస్తున్నారు. 

లోకాకి ఫిట్‌నెస్, ఫుడ్ విషయంలో ఎక్కువ కేర్ తీసుకుంటోంది. 

మోడల్ కావడంతో.. ఫ్యాటీ ఫుడ్స్ జోలికి వెళ్లకుండా.. ఆకుకూరలు ఎక్కువగా తింటోంది.

లోకాకికి ఇన్‌స్టాగ్రామ్‌లో 10 లక్షల మందికి పైగా ఫాలోయర్స్ ఉన్నారు.

45 ఏళ్ల ఏజ్ ఉన్నా.. లోకాకి.. హాట్ ఫొటోషూట్లు చేస్తోంది. తద్వారా ఆమెకు అభిమానుల సంఖ్య వేగంగా పెరుగుతోంది.

ఆమె ఫొటోలను చూసేవారు.. కూతురి కంటే తల్లి చిన్నదిగా కనిపిస్తుంది అంటున్నారు. ఆమెకు 45 ఏళ్లా అని ఆశ్చర్యపోతున్నారు.

(All images credit - instagram - loukaki24)