ఆ పార్టీలకు దూరం.. అందుకే హీరోయిన్ ఛాన్స్‌లు రాలేదు.. 

యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు.

అనసూయ తన అందచందాలతో పాటు..

చురుకైన మాటలతో కొన్ని సంవత్సరాలుగా తెలుగు వారిని అలరిస్తోంది. 

తెలుగు యాంకరింగ్‌లో గ్లామర్‌ను అద్దిన అతికొద్ది మందిలో ఈ భామ కూడా ఒకరు. 

ఇక అది అలా ఉంటే.. అనసూయ తాజాగా ఓ ఇంటర్వూలో మాట్లాడుతూ..

 షూటింగ్స్‌లో నా పని నేను చూసుకుని వెళ్తుంటాను.

సినిమా అయ్యాక జరిగే పార్టీలకు చాలా దూరంగా ఉంటాను. 

ఈ కారణంగా చాలా హీరోయిన్ అవకాశాలను కూడా కోల్పోయానని తెలిపింది.

అలా పార్టీలకు వెళ్తేనే అవకాశాలు వస్తాయంటే.. దాన్ని నేను ఎంకరేజ్ చేయనని తెలిపింది.

 ప్రస్తుతం అనసూయ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి

ఇక ప్రస్తుతం అనసూయ పుష్ప2లో నటిస్తోంది.. ఈ సినిమాకు సుకుమార్ దర్శకుడు.. అల్లు అర్జున్ హీరో..