ట్రాఫిక్‌లో ఈ 10 జాగ్రత్తలు తప్పక తీసుకోండి!

రోడ్డుపై ఎప్పుడూ ఇతర వాహనాలతో పోటీ పెట్టుకోవద్దు. ఎవరి వీలును బట్టీ వారు వేగంగా వెళ్తుంటారు. 

రోడ్డుపై ఎప్పుడూ ఇతర వాహనాలను ఫాలో అవ్వొద్దు. మీదైన డ్రైవింగ్ మీరు ఫాలో అవ్వాలి.

ట్రాఫిక్‌లో సహనంతో ఉండాలి. ఏమాత్రం అది కోల్పోయినా, ప్రమాదాలు జరగగలవు.

ముందు మాత్రమే కాకుండా.. అన్ని వైపులా చూసుకోవాలి. మిర్రర్‌లలో గమనిస్తూ ఉండాలి.

మనం జాగ్రత్తగా ఉన్నా, ఇతరులు రూల్స్ బ్రేక్ చేస్తుంటారు. అలాంటి వాళ్లతో అలర్ట్‌గా ఉండాలి.

గ్రీన్ సిగ్నల్ ఉన్నా నెమ్మదిగానే వెళ్లాలి. ఎందుకంటే.. ఎవరైనా అడ్డుగా దూసుకొచ్చే, ప్రమాదం ఉంటుంది.

పెద్ద వాహనాలు సడెన్ బ్రేక్ వేసే ఛాన్స్ ఉంటుంది. వాటి వెనక వెళ్లేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

రోడ్డు ఎక్కే ముందే బ్రేక్స్ చెక్ చేసుకోవాలి. అలాగే టైర్లలో గాలి సరిగా ఉందో, లేదో చూసుకోవాలి.

ఇండికేటర్ లైట్స్ వల్ల చాలా ప్రమాదాలు జరగకుండా ఆగుతాయి. అందువల్ల టర్న్ సమయంలో వాటిని తప్పక వాడాలి.

ఇండికేటర్ ఇచ్చినా, వెనక వచ్చే వాహనదారుల్ని మిర్రర్‌లో గమనిస్తూ.. టర్న్ తీసుకోవాలి. 

ఇలా జాగ్రత్తలు పాటిస్తూ, డ్రైవింగ్ చేస్తే, సేఫ్‌గా గమ్యస్థానాన్ని చేరుకోగలం.