డిగ్రీ అర్హతతో ప్రముఖ బ్యాంకులో ఉద్యోగాలు..

నిరుద్యోగులకు ప్రముఖ బ్యాంక్ గుడ్‌న్యూస్ చెప్పింది. 

తాజాగా నైనిటాల్ బ్యాంక్ లిమిటెడ్  మేనేజ్‌మెంట్ ట్రైనీ, క్లర్క్ పోస్టుల భర్తీకి రిక్రూట్‌మెంట్ ప్రక్రియను ప్రారంభించింది. 

అర్హులైన అభ్యర్థులు అధికారిక పోర్టల్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

ఈ గడువు ఆగస్టు 27తో ముగుస్తుంది.

ఈ రిక్రూట్‌మెంట్‌తో మొత్తం 110 పోస్టులను భర్తీ చేస్తుంది. 

ఇందులో మేనేజ్‌మెంట్ ట్రైనీ 60 పోస్టులు కాగా, క్లర్క్ పోస్టులు 50 భర్తీ కానున్నాయి.

దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 21 నుంచి 32 ఏళ్ల మధ్య ఉండాలి. 

మేనేజ్‌మెంట్ ట్రైనీ కోసం ఎంపికయ్యే అభ్యర్థులకు నెల జీతం రూ.40,000గా ఉంటుంది. 

క్లర్క్ పోస్ట్‌కు రూ.19,900 నుంచి రూ.47,920 మధ్య ఉంటుంది.

పూర్తి వివరాల కోసం అధికారిక పోర్టల్ www.nainitalbank.co.in ఓపెన్ చేయాలి.