అంతరిక్షంలో అద్భుత దృశ్యాన్ని చూపించిన నాసా

అంతరిక్షంలో తరచుగా షాకింగ్ దృశ్యాలు కనిపిస్తుంటాయి.

ఒక్కోసారి మనల్ని  ఆశ్చర్యపరిచే, సంతోషకర దృశ్యాలూ కనిపిస్తాయి.

తాజాగా నాసా అంతరిక్షంలో కనిపించే క్రిస్మస్ చెట్టు ఫొటోని షేర్ చేసింది.

NASA ప్రకారం, ఈ ఫొటోలో ఉన్నది, భూమికి 2500 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న NGC 2264.

చిత్రంలో, ఆకుపచ్చ ఆకారం క్రిస్మస్ చెట్టులా కనిపిస్తోంది.

NGC 2264లో మెరిసే నక్షత్రాలు చెట్టు మీద లైట్లలా కనిపిస్తున్నాయి.

అందులోని వాయువు వ్యాపిస్తూ, చెట్టు కొమ్మల్లా కనిపిస్తోంది.

నాసా ఈ దృశ్యాన్ని 'టి క్లస్టర్' రూపంలో ప్రపంచానికి అందించింది.

ఈ అంతరిక్ష దృశ్యాన్ని NASA యొక్క చంద్ర ఎక్స్-రే అబ్జర్వేటరీ తీసింది.

క్రిస్మస్ హాలిడే సీజన్‌లో నాసా షేర్ చేసిన ఈ ఫొటోపై ప్రపంచవ్యాప్తంగా హర్షం వ్యక్తమవుతోంది.