NIACLలో 450 ఉద్యోగాలు..

న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్ నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది.

అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (స్కేల్ I) ఉద్యోగాలకు భారీ రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌ నిర్వహిస్తోంది.

తాజా నోటిఫికేషన్‌తో మొత్తం 450 ఖాళీలను సంస్థ భర్తీ చేయనుంది. 

దీనికి సంబంధించిన అప్లికేషన్‌ ప్రాసెస్‌ 2023 ఆగస్టు 1న ప్రారంభమవుతుంది. 

అర్హత ఉన్నవారు 2023 ఆగస్టు 21లోపు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాలి. 

జనరల్/OBC/EWS అభ్యర్థులు రూ.750

SC/ST/PwD అభ్యర్థులు రూ.100 ఫీజు చెల్లించాలి.

నియమితులైన అభ్యర్థులకు ఆకర్షణీయమైన నెలవారీ జీతం రూ.80,000 అందుతుంది.

పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్‌ www.newindia.co.inను ఓపెన్‌ చేయాలి.