హైదరాబాద్‌‌లో కొత్త వైరస్..

కొత్త వైరస్ హైదరాబాద్‌లో కలకలం రేపుతోంది.

అత్యంత వేగంగా వ్యాపించే నొరో వైరస్ హైదరాబాద్‌లోనూ తన ప్రతాపాన్ని చూపిస్తోంది.

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఈ వైరస్ శరవేగంగా విజృంభిస్తోంది.

పాతబస్తీ ప్రాంతంలో ఈ వైరస్ కారణంగా రోజుకు 100 నుంచి 120 కేసులు నమోదవుతున్నాయి.

నొరో వైరస్ వ్యాప్తికి కలుషిత నీరే ప్రధాన కారణంగా తెలుస్తోంది.

బయట దొరికే కలుషిత ఆహారం, నీరు తాగడంవల్ల ప్రజలు ఈ వైరస్ బారిన పడుతున్నారు.

నొరో వైరస్‌తో జాగ్రత్తగా ఉండాలంటూ జీహెచ్ఎంసీ హెచ్చరికలు జారీ చేసింది.

ఈ వ్యాధి లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు వెల్లడించింది.

చలి జ్వరం, వాంతులు, విరేచనాలు, నీరసం, కడుపు నొప్పి, డీహైడ్రేషన్ లక్షణం కూడా ఉంటుందని తెలిపింది. 

చేతులను సబ్బుతో శుభ్రం చేసుకోవాలని, కాచి చల్లాల్చి వడపోసిన నీటిని తాగాలి.

ఇంటిని పరిసరాలను క్రిమిసంహారక మందులతో శుభ్రం చేసుకోవాలని సూచించింది.