వైట్ డ్రెస్‌లో ఏంజెల్‌లో  మెరిసిపోతున్న  నుపూర్ సనన్..

సినీ ఇండస్ట్రీలో ఒకే కుటుంబం నుండి ఎంతో మంది నటులు పరిచయమవుతూనే ఉన్నారు.

ప్రస్తుతం స్టార్ హోదాలు అందుకున్న వాళ్లు కూడా ఉన్నారు.

ఇదిలా ఉంటే ఒకే కుటుంబానికి చెందిన పలువురు అక్కా చెల్లెలు ఇప్పుడు ఇండస్ట్రీలో స్టార్ హోదాలో ఉన్నారు.

తాజాగా కృతి సనన్  చెల్లెలు.. నుపూర్ సనన్.. రవితేజ హీరోగా నటిస్తోన్న ‘టైగర్ నాగేశ్వరరావు’  మూవీతో సినీ ఇండస్ట్రీలో హీరోయిన్‌గా అడుగు పెట్టింది.

ఈ సినిమాలో టైగర్ నాగేశ్వరరావు ప్రియురాలి పాత్రలో ఉన్నంతలో అలరించింది.

నుపుర్ సనన్.. నటి కాకముందు గాయనిగా శిక్షణ తీసుకుంది.

ఆపై నటనపై మక్కువగా సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టింది.

ఈమె ఢిల్లీ యూనివర్సిటీలోని నార్త్ క్యాంపస్‌లోని కిరోరి మాల్ కాలేజ్ నుండి కామర్స్‌లో డిగ్రీ పూర్తి చేసింది.

ఆ తర్వాత అక్క కృతి సనన్ స్పూర్తితో సినిమాల్లో ప్రవేశించింది.

నుపూర్ సనన్ ముందుగా 2019లో అక్షయ్ కుమార్ నటించిన ఫిల్హాల్ అనే ప్రైవేట్ ఆల్బబ్ సాంగ్‌లో ఆయన సరసన నటించింది.

ఆ తర్వాత ప్రముఖ టీవీ కామెడీ డ్రామా ‘పాప్ కౌన్’ అనే టీవీ సిరీస్‌లో నటించింది. 2022లో ఇది టెలికాస్ట్ అయింది.