ఇండియాలో ఎంత మంది కార్లు వాడుతున్నారు?

ఇండియాలో ఎంత మంది కార్లు వాడుతున్నారు?

ప్రపంచవ్యాప్తంగా కార్ల వాడకంలో ఇండియా చాలా వెనకబడి ఉంది.

ఇండియాలో ప్రతి 100 మందిలో ఆరుగురు మాత్రమే కార్లు వాడుతున్నారు.

కార్ల వాడకంలో ఇటలీ టాప్‌లో ఉంది. అక్కడ 89 శాతం మంది సొంత కారు కలిగివున్నారు.

88 శాతంతో ఇటలీ తర్వాతి స్థానంలో అమెరికా ఉంది.

జర్మనీలో 85 శాతం మందికి సొంత కార్లు ఉన్నాయి.

ఫ్రాన్స్, దక్షిణ కొరియాలో 83 శాతం మంది కార్లు వాడుతున్నారు.

జపాన్‌లో 81 శాతం మందికి కార్లు ఉన్నాయి.

స్పెయిన్‌లో 79 శాతం, గ్రీస్‌లో 76 శాతం, యూకేలో 74 శాతం మందికి సొంత కార్లు ఉన్నాయి.

ఇజ్రాయెల్‌లో 71 శాతం, పోలాండ్‌లో 64 శాతం, రష్యాలో 55 శాతం కార్లు నడుపుతున్నారు.

చిలీలో 49 శాతం, చైనాలో 17 శాతం, పాకిస్థాన్‌లో 3 శాతం మంది సొంత కార్లు వాడుతున్నారు.

ప్యూ రీసెర్చ్ సెంటర్ ఈ రిపోర్ట్ విడుదల చేసింది. దీన్ని బట్టీ ఇండియాలో ఆటో ఇండస్ట్రీకి చాలా ఫ్యూచర్ ఉందనుకోవచ్చు.