ఏ దేశంలో ఎంత మంది క్రెడిట్ కార్డులు వాడుతున్నారు?

ప్రపంచంలో క్రెడిట్ కార్డులను ఎక్కువగా కెనడా ప్రజలు వాడుతున్నారు. అక్కడి జనాభాలో 82.74 శాతం మంది వాటిని ఉపయోగిస్తున్నారు.

కెనడా తర్వాత 2వ స్థానంలో ఇజ్రాయెల్ ఉంది. ఆ దేశంలోని 79.05 శాతం మంది జనాభా క్రెడిట్ కార్డులను వాడుతున్నారు.

3వ స్థానంలో ఐస్‌లాండ్ ఉంది. ఇక్కడ 74 శాతం మందికి క్రెడిట్ కార్డులున్నాయి.

4వ స్థానంలో హాంకాంగ్ నిలిచింది. ఈ దేశంలో 71.63 శాతం మంది క్రెడిట్ కార్డులను తెగ వాడేస్తున్నారు.

5వ స్థానంలో జపాన్ నిలిచింది. అక్కడి జనాభాలో 69.66 శాతం మంది క్రెడిట్ కార్డులతో పని కానిస్తున్నారు.

సంపన్న దేశం స్విట్జర్లాండ్‌లో కూడా 69.21 శాతం మంది క్రెడిట్ కార్డులు వాడుతున్నారు.

అభివృద్ధిలో దూసుకెళ్తున్న దక్షిణ కొరియాలో 68.44 శాతం మందికి క్రెడిట్ కార్డులున్నాయి.

యూరప్‌లో మరో సంపన్న దేశమైన నార్వేలో 66.74 శాతం మంది క్రెడిట్ కార్డులపై ఆధారపడుతున్నారు.

అమెరికాలో 66.7 శాతం మంది, ఫిన్‌లాండ్‌లో 65.29 శాతం మంది, తైవాన్‌లో 63.77 శాతం మంది కార్డులు వాడేస్తున్నారు.

ఈ లిస్టులో 62.11 శాతంతో బ్రిటన్ 12వ స్థానంలో ఉంది. ఆ తర్వాత ఆస్ట్రియా (58.99%), డెన్మార్క్ (58.5%), ఇటలీ (57.88%) ఉన్నాయి.

ఈ లిస్టులో భారత్ టాప్ 41వ స్థానంలో ఉంది. భారత్‌లోని మొత్తం జనాభాలో 4.62 శాతం మంది మాత్రమే క్రెడిట్ కార్డులను వాడుతున్నారు.