పీఎం కిసాన్ డబ్బులు రూ.8 వేలకు పెంపు

కేంద్ర ప్రభుత్వం రైతులకు ఎన్నో పథకాలను ప్రవేశపెట్టింది.

దీనిలో భాగంగానే.. పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి ఒకటి.

16వ విడతను ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రధాని నరేంద్ర మోదీ విడుదల చేశారు.

ప్రస్తుతం లబ్ధిదారులు 17వ విడత సాయం కోసం ఎదురు చూస్తున్నారు.

పీఎం కిసాన్‌ పథకం లబ్ధిదారులు ప్రతి నాలుగు నెలలకు రూ.2,000 పొందుతారు.

అంటే సంవత్సరానికి రూ.6,000 పెట్టుబడి సాయం అందుతుంది.

డబ్బులు నేరుగా లబ్ధిదారుల బ్యాంకు అకౌంట్‌లో క్రెడిట్‌ అవుతుంది.

ఈ పథకం కింద రైతులకు నాలుగు నెలలకు రూ.2వేల చొప్పున సంవత్సరానికి రూ.6 వేలు అందిస్తారు.

అయితే పీఎం కిసాన్ కింద ఇచ్చే మొత్తాన్ని రూ.8 వేలకు పెంచాలని డిమాండ్ ఉంది.

దీనిపై రాజస్థాన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

కిసాన్ సమ్మాన్ నిధి కింద ఇచ్చే మొత్తాన్ని రూ.2 వేలు పెంచింది.

ఇందుకు సంబంధించి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భజన్ లాల్ కీలక ప్రకటన చేశారు.

దీంతో ఏడాదికి రైతుల ఖాతాల్లో రూ.8 వేలు జమ చేయనున్నారు.