ప్రపంచంలో ఉన్న పులులు ఎన్నో తెలుసా?

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌ మధ్య చాయ్ చర్చ కార్యక్రమం ఆసక్తిగా సాగింది. 

ఈ భేటీలో ఇద్దరూ ఆరోగ్యం, టెక్నాలజీ, వాతావరణం, కరోనా వంటి అంశాలపై చర్చించారు.

ఈ సంభాషణలో ప్రధాని మోదీ, బిల్ గేట్స్‌కి NaMo యాప్‌ని చూపించారు. అది చూసి మీరు అద్భుతాలు చేశారు బిల్‌గేట్స్ మెచ్చుకున్నారు.

AI టెక్నాలజీ ఇండియా అంతటా విస్తరించాలని ప్రధాని మోదీ ఆకాంక్షించారు. 

లక్ పతీ దీదీ పథకంతో 3 కోట్ల మంది మహిళలకు మేలు జరిగేలా చేస్తున్నామన్న మోదీ.. భారతీయ మహిళలు టెక్నాలజీలో దూసుకెళ్తున్నారన్నారు.

ఇండియాలోని విద్యా వ్యవస్థలో లోపాలను టెక్నాలజీతో సరిదిద్దాలని ప్రధాని మోదీ ఆకాంక్షించారు. 

మిల్లెట్స్ ఉత్పత్తి, వాడకం బాగా పెరిగిందన్న మోదీ.. పెద్ద పెద్ద హోటల్స్ సైతం మిల్లెట్స్ ఫుడ్స్ అందిస్తున్నాయన్నారు.

కరోనా సమయంలో భారత ప్రజలు ఆ వైరస్‌తో పెద్ద యుద్ధమే చేశారని ప్రధాని మోదీ మెచ్చుకున్నారు.

వైరస్సా, ప్రజలా అనేది తేల్చుకోవాల్సిన పరిస్థితి వచ్చిందనీ, ప్రజలే నెగ్గారని మోదీ అన్నారు.

తాను ప్రతి రోజూ కధా టీ తాగుతాననీ, దాని వల్ల ఆరోగ్యంగా ఉన్నానని ప్రధాని మోదీ తెలిపారు.

భారత్‌లో సర్వైకల్ క్యాన్సర్ బాధితులు ఎక్కువగా ఉండటంతో, సర్వైకల్ వ్యాక్సిన్ కోసం భారీగా నిధులు కేటాయించామని మోదీ తెలిపారు.