పుష్ప 2 ఓటీటీ రైట్స్@270 కోట్లు...!

రెండు నేషనల్ అవార్డులు రావడంతో పుష్ప సీక్వెల్ పై ఆడియన్స్ లో ఉన్న ఎక్స్ పెక్టేషన్స్ అన్ని ఇన్ని కావు. 

టీజర్ దెబ్బతో అంచనాలు తారా స్థాయికి వెళ్లిపోయాయి. 

ఆల్రెడీ ఈ సినిమా వెయ్యి కోట్ల బొమ్మ అని అందరూ ఫిక్స్ అయిపోయారు. 

ఈ సారి పుష్పగాడి ఊచకోత మాములుగా ఉండదని ఆ మధ్య రిలీజైన టీజర్‌తో క్లారిటీ వచ్చేసింది. 

దానికి తోడు సినిమాకు సంబంధించిన పలు లీకులు బన్నీ ఫ్యాన్స్‌నే కాదు.. యావత్ సినీ లవర్స్‌లో ఎక్కడలేని అంచనాలు క్రియేట్ చేస్తున్నాయి. 

రీసెంట్‌‌గా ఈ సినిమా ఓటీటీ డీల్‌ లాక్ చేసుకున్నట్లు సమాచారం. 

ఈ సినిమా ఓటీటీ రైట్స్‌ను నెట్ ఫ్లిక్స్ సంస్థ దక్కించుకుంది. 

 తెలుగు సహా అన్ని భాషలకు కలుపుకొని అక్షరాల రూ.270 కోట్లకు డీల్ లాక్ చేసుకున్నట్లు తెలుస్తుంది.

ఇంత పెద్ద మొత్తంలో ఓటీటీ డీల్ అంటే మాముులు విషయం కాదు. 

ఈ లెక్కన పుష్ప సీక్వెల్‌పై ఏ రేంజ్‌లో క్రేజ్ ఉందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. 

సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈసినిమాలో ఫాహద్ ఫాజిల్ ప్రతినాయకుడిగా కనిపించబోతున్నాడు.