ప్రియమైన వ్యక్తికి రష్మిక ఇంగ్లీష్ ముద్దులు.. పిక్స్ వైరల్..

కూర్గ్ భామ రష్మిక మందన్న గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. 

తెలుగులో ఛలో సినిమాతో ఎంట్రీ ఇచ్చింది..

వరుస హిట్ సినిమాలతో కుర్రకారు హృదయాలను దోచుకుంటోంది.

ప్రస్తుతం రష్మిక.. తెలుగులో అల్లు అర్జున్ పుష్ప2లో నటిస్తోంది.

ఈ భామ ఇటీవలే వారసుడుతో మరో బంపర్ హిట్ అందుకుంది. 

ఇక లేటెస్ట్‌గా హిందీలో యానిమల్ అనే ప్యాన్ ఇండియా చిత్రంలో నటించింది. 

రణబీర్ కపూర్ హీరోగా వచ్చిన ఈ సినిమాకు.. సందీప్ రెడ్డి వంగా దర్శకుడు. ఈ సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంది.

అది అలా ఉంటే ఆమె ఓ కుక్క పిల్లను పెంచుకుంటోంది. ఆ పెట్ పేరు ఆరా అని చెప్పింది. 

అంతేకాదు ఆరాతో కొద్ది సేపు గడిపితే చాలు మనస్సు‌కు ఎంతో హాయి కలుగుతుందట..

తాజాగా రష్మిక మందన్న ఆరాతో కొన్ని ఫోటోలను పంచుకుంది. ఆ ఫోటోల్లో రష్మిక ఆరాకు ముద్దులిస్తోంది. 

ప్రస్తుతం దీనికి సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.