Ration Cards: భారీ షాక్.. రేషన్ కార్డులన్నీ రద్దు.. 

ఏపీలో కూటమి ప్రభుత్వం పలు రకాల నిర్ణయాలతో ముందుకు వెళ్తోంది.

ఇచ్చిన హామీలతో పాటు.. వివిధ రకాల పథకాలను ప్రవేశపెడుతోంది.

అయితే మరో కీలక నిర్ణయం తీసుకుంది కూటమి ప్రభుత్వం.

ఎంతో కాలంగా పెండింగ్ లో ఉన్న రేషన్ కార్డుల మంజూరుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

కొత్త కార్డుల అర్హతల గురించి విధివిధానాలను ఖరారు చేయాలని అధికారులకు సూచించింది.

అదే విధంగా ఇప్పటికే ఉన్న కార్డులను రద్దు చేయాలనే నిర్ణయం కూడా తీసుకున్నారు.

అంటే వైసీపీ రంగులతో ఉన్న రేషన్ కార్డులను రద్దు చేసి.. వాటి స్థానంలో కొత్త కార్డులను ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

వీటిపై అధికారులు కూడా కసరత్తు ప్రారంభించారు.

కొత్త రేషన్ కార్డుల రూపకల్పనపై  పౌరసరఫరాల శాఖ కసరత్తు చేస్తుండగా.. దీని కోసం డిజైన్లను పరిశీలిస్తున్నారు.

లేత పసుపు రంగుతో, రాష్ట్ర ప్రభుత్వ అధికారిక చిహ్నం ముద్రించిన కార్డుల నమూనాను అధికారులు పరిశీలిస్తున్నారు.

అధికారులు దీనిని ప్రభుత్వ ఆమోదం కోసం ప్రతిపాదించారు.

వీటితో మరికొన్ని నమూనాలను కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం.