ఆర్బీఐలో 450 ఉద్యోగాలకు నోటిఫికేషన్..

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్. 

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగం సాధించే సువర్ణావకాశం వచ్చింది. 

ఆర్బీఐ తాజాగా అసిస్టెంట్ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ జారీ చేసింది.

అర్హులైన వారు rbi.org.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

ఈ గడువు అక్టోబర్ 4న ముగుస్తుంది. 

ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా ఆర్బీఐ మొత్తం 450 అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేస్తుంది.

దరఖాస్తుదారుల వయసు 20 నుంచి 28 ఏళ్లలోపు ఉండాలి. 

రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

కనీసం 50 శాతం మార్కులతో ఏదైనా విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.

ఎంపికయ్యే అభ్యర్థులకు జీతం నెలకు రూ.47,849 లభిస్తుంది.