మీలో ఈ 7 మార్పులు కనిపిస్తే, ఉప్పు తగ్గించాలి
మహా సముద్రాల్లో బోలెడు ఉప్పు ఉంటుంది. అది లేకుండా మనం ఏదీ తినలేం.
ఉప్పు ఉంటేనే తినే ఆహారం రుచికరంగా ఉంటుంది. అందుకే ఉప్పు సరిపడా వేసుకోవాల్సిందే!
ఉప్పు ఎక్కువైతే ప్రమాదం. హైబీపీ రాగలదు. ఇంకా అనేక రకాల సమస్యలు కూడా వస్తాయి.
మన శరీరంలో 7 మార్పులు కనిపిస్తే, మనం ఉప్పు తగ్గించాలి. అవేంటో చూద్దాం.
1. తరచుగా దాహం వేస్తూ ఉంటుంది. చుట్టూ ఉన్న వారి కంటే మీరు ఎక్కువ వాటర్ తాగుతారు.
2. మాటిమాటికీ తలనొప్పి వస్తుంది. కారణం ఉప్పు వల్ల బీపీ పెరుగుతుంది. ఫలితంగా హెడాక్ వస్తుంది.
3. పొట్ట ఉబ్బుతుంది. చేతులు, కాళ్లకు చెమట పడుతుంది. అధిక ఉప్పు, శరీర నీటిని బయటకు పంపేస్తుంది.
4. తరచుగా హైబీపీ వస్తుంది. దీనివల్ల గుండెకు ప్రమాదం. అందుకే ఉప్పు ఎక్కువ వాడొద్దంటారు.
5. తరచుగా యూరిన్‌కి వెళ్తుంటారు. కారణం అధిక ఉప్పును బయటకు పంపేందుకు కిడ్నీలు ఎక్కువగా పనిచేస్తాయి.
6. కండరాల నొప్పులు వస్తాయి. ఉప్పు ఎక్కువై, బాడీలో ఎలక్ట్రొలైట్స్ బ్యాలెన్స్ తప్పి, ఇలా అవుతుంది.
7. నిద్ర సరిగా పట్టదు. ఇలా మీకు అవుతూ ఉంటే, మీరు ఉప్పు తగ్గించుకోవడం మేలని డాక్టర్లు సూచిస్తున్నారు.
More
Stories
రూ.50,000 పెట్టుబడితో వ్యాపారం
కలలో నీరు కనిపించిందా?
వింత ఖండం?