చందమామ మనకు దూరమైపోతున్నాడు!

చంద్రుడికి సంబంధించిన రకరకాల విషయాలపై శాస్త్రవేత్తలు నిరంతరం ప్రయోగాలు చేస్తూనే ఉంటారు.

తాజాగా చందమామకి సంబంధించిన కీలక విషయాన్ని వెల్లడించారు.

చంద్రుడి ఆకర్షణ శక్తి కారణంగా భూమి మీద సముద్రాలలో ఆటుపోట్లు ఏర్పడుతుంది.. అలలు ఎగసిపడుతుంటాయి.

భూమిపై జీవం ఏర్పడడానికి కావాల్సిన పరిస్థితులు ఉండడం కూడా చంద్రుడి వల్లే సాధ్యమైందంటాయి కొన్ని సిద్ధాంతాలు.

'జాబిల్లి రావే..' అంటూ మనం పాటలు కూర్చిన చందమామ భూమికి దూరంగా జరిగిపోతోందట. 

విస్కసిన్-మ్యాడిసన్ యూనివర్సిటీ పరిశోధకులు ఈ విషయాన్ని కనుగొన్నారు. 

చంద్రుడు క్రమంగా మన పట్టు నుంచి పక్కకు తప్పుకుంటున్నాడని.. ఏటా 3.8cm చొప్పున చంద్రుడు భూమికి దూరమవుతున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు.

చంద్రుడు భూమికి దూరం కావడం భూభ్రమణం మీద ప్రభావం చూపిస్తుందని చెబుతున్నారు. 

దానివల్ల భూమిపై రోజులో కాలం స్వల్పంగా పెరుగుతోంది.

200 మిలియన్ సంవత్సరాల తర్వాత భూభ్రమణానికి 25 గంటలు పడుతుందని పేర్కొన్నారు. 

కాగా 1.4 బిలియన్ ఏళ్ల క్రితం ఓ రోజు 18 గంటల్లో పూర్తయ్యేదని పరిశోధనలో తేలింది.