రెస్టారెంట్ స్టైల్ క్రీమీ టొమాటొ చికెన్ సూప్..

ఈ చలికాలం డిన్నర్ లో ప్రత్యేకంగా ఏదైనా తినాలనిపిస్తుందా? థిక్, క్రిమీ చికెన్ సూప్ ను కొన్ని వస్తువులతోనే తయారు చేసుకోవచ్చు. అది కూడా అతి తక్కువ సమయంలోనే.

కావాల్సిన పదార్థాలు.. మిడియం సైజ్ టామాటాలు 5 చికెన్ 180 గ్రాములు కప్పు ఫ్రెష్ క్రీం టీస్పూన్ కారం

టీస్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉల్లిపాయలు 2 వెల్లుల్లిరెబ్బలు 4 బట్టర్ 4 టీస్పూన్స్ పచ్చిమిర్చి 3

రెడ్ చిల్లీ ఫ్లేక్స్ 1 టీస్పూన్ రోజ్మేరి ఆకులు ఉప్పు కావాల్సినంత మిరియాలు

స్టెప్ 1.. ఈ రెసిపీని తయారు చేయడానికి టామాటాలను ఇతర కూరగాయాలను శుభ్రం చేసి కట్ చేసి పెట్టుకోవాలి.

స్టెప్ 2.. చికెన్ కూడా నీటిగా కడిగి చిన్న పీసులుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ప్రెజర్ కుక్కర్లో ఉప్పు, కాసిన్ని నీల్లు పోసి 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి.

స్టెప్ 3.. మరో ప్యాన్ తీసుకుని 2 టేబుల్ స్పూన్స్ బట్టర్ వేయాలి.  ఆ తర్వాత ఉల్లిపాయలు, వెల్లుల్లి, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి.

ఇప్పుడు కుక్కర్లోని చికెన్ స్టాక్ పక్కన పెట్టి కేవలం చికెన్ ముక్కలను వేయాలి.

కావాలంటే ఇక్కడ మీరు మరింత బట్టర్ కూడా వేసుకోవచ్చు. చికెన్, కూరగాయలు పూర్తిగా ఉడికేవరకు వండుకోవాలి

స్టెప్ 5.. ఇప్పుడు టొమాటో ప్యూరీ, మసాలాలు, చికెన్ స్టాక్ కూడా వేసి చిన్న మంట మీద ఉడికించుకోవాలి.

స్టెప్ 6.. సూప్ మీరు అనుకున్న కన్సిటెన్సీ వచ్చా మంట తగ్గించి క్రీం వేసుకోవాలి. ఉప్పు, మిరియాలు వేసి రుచి సరిచూసుకోవాలి. రోజ్మేరి కూడా యాడ్ చేయాలి.

స్టెప్ 7.. 5-6 నిమిషాలపాటు క్రీమీ టెక్చర్ వచ్చే వరకు వేడివేడిగా వడ్డిస్తే రుచి అదిరిపోతుంది.