కానిస్టేబుల్‌గా విజయ్ దేవరకొండ.. ఇదెక్కడి మాస్‌రా మామ?

లైగర్ రిజల్ట్ విజయ్ దేవరకొండకు మాములుగా దెబ్బ కొట్టలేదు. 

పాన్ ఇండియా రేంజ్‌లో హిట్టు కొట్టాలనుకున్న కల.. కలలానే మిగిలిపోయింది. 

ఆ తర్వాత రిలీజైన ఖుషీ యావరేజ్ హిట్టు కొట్టగా.. ఫ్యామిలీ స్టార్ డిజాస్టర్‌గా నిలిచింది. 

దాంతో కాస్త గ్యాప్ తీసుకుని పడిన చోటే లేవాలన్న సామేతను ఒంట బెట్టుకుని గౌతమ్ తిన్ననూరితో భారీ సినిమాను పట్టాలెక్కించాడు. 

ఈ సారి ఎలాగైనా పాన్ ఇండియా రేంజ్‌లో హిట్టు కొట్టాలని కసితో ఉన్నాడు.

గ్యాంగ్‌స్టర్ బ్యాక్ డ్రాప్‌లో ఈ సినిమా కథ సాగుతుంది. 

ఇప్పటికే రిలీజైన పోస్టర్లు జనాల్లో మంచి అటెన్షన్‌ను క్రియేట్ చేశాయి. 

పైగా జెర్సీ తర్వాత గౌతమ్ చేస్తున్న సినిమా కావడంతో ఆడియెన్స్‌లో మంచి తిరుగులేని అంచనాలు నెలకొన్నాయి. 

ఈ సినిమాలో విజయ్ పోలీస్ కానిస్టేబుల్‌గా కనిపించనున్నాడట. 

మిడిల్ క్లాస్ ఎమోషన్‌ను హైలైట్ చేయబోతున్నట్లు తెలుస్తుంది.

ఈ సినిమా బడ్జెట్ రూ.100 కోట్ల పైమాటే అని తెలుస్తుంది.