పండ్లు గరిష్టంగా పోషకాలను కలిగి ఉన్నందున వాటిని తాజావిగా తినడం అనువైనది.
భోజనంలో పండ్లను జోడించడం వల్ల భోజనంలోని పోషకాలను మెరుగుపరచడంలో సహాయపడుతుంది
పండ్లను నెమ్మదిగా తినడం వల్ల అతిగా తినడాన్ని నివారించడంలో కూడా సహాయపడుతుంది.
ఒక్క పండునే తరచూ తినకుండా,వివిధ రకాల పండ్లను తినడం వల్ల అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.
ఏ పండు తినాలో అవగాహన ఉండటమే కాకుండా పండు ఎంత ఉండాలో తెలుసుకోవడం కూడా అంతే ముఖ్యం.
ఫైబర్ లేని పండ్ల రసాలను తీసుకోవడం తగ్గించడం,వాటిని తాజా పండ్లతో భర్తీ చేయడం ఆరోగ్యకరమైన ఆప్షన్.
రోజూ పండ్లు తినడం వల్ల ఫైబర్ తీసుకోవడం పెరుగుతుంది. రక్తంలో షుగర్ లెవల్స్ ని నియంత్రించడంలో, జీర్ణక్రియలో సహాయపడుతుంది.