ఇలా చేశారంటే గోరింటాకు మామూలుగా పండదు

(image - insta - hennography_by_asnour)

అందరికీ గోరింటాకు నల్లగా పండదు. కొన్ని చిట్కాలతో ఇది సాధ్యమే. (image - insta - moly_hennaaceh)

కాస్త రేటు ఎక్కువైనా, బ్రాండెడ్ కోన్‌లు బాగా పండుతాయి. గోరింటాకును మిక్సీ పట్టి మెత్తగా పేస్టులా చేసుకున్నా పర్వాలేదు. (image - insta - hennography_by_asnour)

చేతులపై గోరింటాకు మనలో టెన్షన్ తగ్గిస్తుంది. నరాలపై బాగా పనిచేసి, తలనొప్పి, జ్వరం వంటి వాటి నుంచి రక్షిస్తుంది. (image - insta - hennography_by_asnour)

హెన్నా వేసుకునే ముందు.. చేతులను శుభ్రంగా కడుక్కొని.. టవల్‌తో పొడి అయ్యేలా తుడుచుకోండి. ఆ తర్వాత హెన్నా అప్లై చెయ్యండి. (image - insta - hennography_by_asnour)

గోరింటాకు వేసుకున్న తర్వాత గంట వరకూ చేతులను అతిగా కదపవద్దు. వాటికి గాలి తగిలేలా ఉండాలి. (image - insta - mayuripotwekar_mehendi)

వేసిన గోరింటాకు 4 గంటల్లో ఆరిపోతుంది. అప్పుడు నిమ్మరసం, పంచదార కలిపిన మిశ్రమాన్ని గోరింటాకుపై చల్లాలి. (image - insta - mayuripotwekar_mehendi)

ప్రతీ 2 గంటలకోసారి ఇలాగే స్ప్రే చెయ్యాలి. 8 గంటల్లో మూడుసార్లు స్ప్రే చెయ్యాలి. ఆరిపోయాక.. గోరింటాకును తొలగించుకోవాలి. (image - insta - zeerahennaworks)

గోరింటాకును తొలగించడానికి ముందుగా పొడిని చేతులతో తొలగించండి. ఆ తర్వాతే నీటితో కడగండి. (image - insta - hasi.henna)

కడిగిన 12 గంటల తర్వాత గోరింటాకు ఎర్రగా అవుతుంది. మరో 12 గంటల తర్వాత నల్లగా అవుతుంది. (image - insta - hetveegada_mehendi_art)

కొంతమంది గోరింటాకు వేసుకునేముందు యూకలిప్టస్ ఆయిల్‌‌ని అరచేతులపై రాసుకుంటారు. ఇలా చెయ్యకపోయినా పర్వాలేదు. (image - insta - hennabycikyaa)

గోరింటాకు వేసుకున్న 4 గంటల తర్వాత.. కొన్ని లవంగాలను వేపి.. వచ్చే ఆవిరి ముందు చేతులను అడ్డుగా పెడతారు. మీరు కూడా ఇలా చేసుకోవచ్చు. బాగా పండుతుంది. (image - insta - moly_hennaaceh)