2025లో శనిగ్రహ వలయాలు అదృశ్యం.. నాసా మాట!
మన సౌర వ్యవస్థలోని గ్రహాలలో శని చాలా ప్రత్యేకమైనది.
వలయాలు శనిగ్రహాన్ని ఇతర గ్రహాల కంటే భిన్నమైనదిగా చేశాయి.
శనిగ్రహ వలయాలు 2,82,000 కిలోమీటర్లు విస్తరించి ఉన్నాయి.
అయినప్పటికీ మామూలు కంటితో చూస్తే ఈ వలయాలు కనిపించవు.
పవర్‌ఫుల్ టెలిస్కోప్‌తో చూస్తే మాత్రం వలయాలు స్పష్టంగా కనిపిస్తాయి.
రెండేళ్ల తర్వాత ఈ రింగులు కనిపించడం మానేస్తాయన్న వాదన వినిపిస్తోంది.
ఆప్టికల్ ఇల్యూషన్ కారణంగా 2025లో భూమికి ఈ వలయాలు కనిపించవని ఓ రిపోర్టు చెబుతోంది.
ఈ విషయాన్ని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా కూడా ధృవీకరించింది.
వలయాలు కనిపించకపోవడానికి కారణం శని గ్రహం భూమితో కలిసిపోవడమే.
శనిగ్రహం ప్రస్తుతం భూమికి 9 డిగ్రీల కోణంలో వంగి ఉంది. 2024 నాటికి, శని కోణం 3.7 డిగ్రీలకు తగ్గుతుంది.
2025 నాటి శని కోణం భూమికి సమానమవుతుంది. అందువల్ల రింగ్స్ ఉన్నా, భూమి నుంచి చూస్తే కనిపించవు.
More
Stories
అతిమధురంతో రోగాలు పరార్
మిర్చితో ఇమ్యూనిటీ
బరువు తగ్గండిలా!