పాలపుంతలో భారీ బ్లాక్‌హోల్

మన మిల్కీవే (Milkyway) గెలాక్సీలో ఇప్పటివరకూ చూడని ఓ అతిపెద్ద కృష్ణ బిలం (Black hole) ఉందని ఖగోళ శాస్త్రవేత్తలు కనిపెట్టారు.

ఇది మామూలు బ్లాక్‌హోల్ కాదు.. మన సూర్యుడి కంటే 22 రెట్లు పెద్దదిగా ఉంది. దీనికి గయా BH3 అనే పేరు పెట్టారు.

ఈ బ్లాక్‌హోల్ భూమికి 2,000 కాంతి సంవత్సరాల దూరంలో, గరుడ నక్షత్ర మండలంలో ఉంది. 

ఈ విషయాన్ని యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ప్రయోగించిన గయా మిషన్ ఇచ్చిన డేటాను పరిశీలించి కనిపెట్టారు. 

ఓ నక్షత్రం అస్థిరంగా కదులుతుండటాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. దాని పక్కనే బ్లాక్ హోల్ ఉందని తెలిసింది.

ఆ నక్షత్రం.. మన సూర్యుడి కంటే కొంత చిన్నది. ఇది బ్లాక్‌హోల్ చుట్టూ తిరుగుతోంది. దీనికి BH3 అనే పేరు పెట్టారు.

మన మిల్కీ వే గెలాక్సీలో గయా టెలిస్కోప్.. ఇప్పటికే 2 కృష్ణ బిలాలను కనిపెట్టింది. వాటిని గయా BH1, గయా BH2 అని పిలుస్తున్నారు.

ఈ టెలిస్కోప్ పదేళ్లుగా భూమికి 15 లక్షల కిలోమీటర్ల దూరంలో.. సూర్యుడికి దూరంగా లాంగ్ రేంజ్ పాయింట్ 2 నుంచి పనిచేస్తోంది.

ఇది 2022లో 180 కోట్ల నక్షత్రాలు, వాటి కదలికలతో ఉన్న త్రీడీ మ్యాప్‌ని పంపింది. 

ఇప్పుడు కనిపెట్టిన బ్లాక్‌హోల్ చాలా పెద్దదే అయినప్పటికీ.. ఇది భూమిని ఆకర్షించేంత దగ్గరలో లేదు. 

ఈ బ్లాక్‌హోల్‌ దగ్గరకు భూమి వెళ్లే అవకాశం లేదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.