అయోధ్య రాముడి విగ్రహ శిల్పి అరుణ్ యోగిరాజ్ ఎవరో తెలుసా?

ప్రముఖ శిల్పి అరుణ్ యోగిరాజ్.. కర్ణాటకలోని మైసూర్‌కి చెందినవారు. 

ఈయన కుటుంబం ఐదు తరాలుగా మైసూరులో విగ్రహాలు తయారుచేస్తున్నారు.

అరుణ్ యోగిరాజ్ అయోధ్య ఆలయ బాల రాముడి విగ్రహానికి ప్రాణం పోశారు. ఆ విగ్రహం నీలిరంగులో మెరుస్తూ ఉందని సమాచారం.

జనవరి 22న ప్రాణప్రతిష్టలో ఆ విగ్రహాన్నే అయోధ్య రామాలయంలోని గర్భగుడిలో ప్రతిష్టించబోతున్నారని తెలిసింది.  

అరుణ్ యోగిరాజ్, ప్రస్తుతం దేశంలోని ప్రముఖ శిల్పకారుల్లో ఒకరు. యంగ్ ఏజ్ నుంచే ఆయన శిల్పిగా మారారు. 

తండ్రి యోగిరాజ్, తాత బసవన్న శిల్పి ప్రేరణతో ఈ వృత్తి చేపట్టారు. బసవన్న మైసూరు రాజు పోషణలో ఉండేవారు.

అరుణ్ MBA చేశారు. కార్పొరేట్ రంగంలో పనిచేశారు కూడా. 

మనసులో ఆయనకు శిల్పకళపైనే ఆసక్తివుంది. దాంతో 2008లో తిరిగి ఈ వృత్తిలోకి వచ్చేశారు.

2008 నుంచి యోగిరాజ్ తయారుచేస్తున్న విగ్రహాలకు దేశవ్యాప్తంగా గుర్తింపు వస్తోంది.

అరుణ్ చేసిన వాటిలో ఒకటి 30 అడుగుల ఎత్తున్న సుభాష్ చంద్రబోస్ విగ్రహం. దీన్ని ఢిల్లీ, ఇండియా గేట్ దగ్గర్లో చూడగలం.

కేదార్‌నాథ్‌లో 12 అడుగుల శంకరాచార్య విగ్రహం, మైసూరులో 21 అడుగుల హనుమాన్ విగ్రహం కూడా యోగిరాజ్ సృష్టించినవే.

(All images credit - x - @yogiraj_arun)