చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యం.. ఏ దేశంలో ఎంత?
ప్రపంచ పార్లమెంట్లలో మహిళలకు ఎంత ప్రాతినిధ్యం ఉందో ఇంటర్-పార్లమెంటరీ యూనియన్ రిపోర్ట్ ఇచ్చింది.
ఈ రిపోర్ట్ ప్రకారం చట్టసభల్లో మహిళలకు తగిన ప్రాతినిధ్యం ఇచ్చే విషయంలో భారతదేశం చాలా వెనకబడి ఉంది.
ప్రపంచంలో అత్యధికంగా రువాండా పార్లమెంట్‌లో మహిళలకు 61 శాతం ప్రాతినిధ్యం ఉంది.
రెండో స్థానంలో ఉన్న క్యూబాలోని పార్లమెంట్‌లో మహిళలు 53 శాతం ఉన్నారు.
50 శాతం మహిళా ప్రాతినిధ్యంతో మూడో స్థానంలో UAE, మెక్సికో, న్యూజిలాండ్ నిలిచాయి.
ఐస్‌లాండ్‌లో ఇది 48 శాతం ఉండగా, సౌతాఫ్రికాలో 47 శాతం, స్వీడన్, ఫిన్‌లాండ్‌లో 46 శాతం ఉంది.
నార్వే, అర్జెంటినాలో 45 శాతం, డెన్మార్క్‌లో 44 శాతం, స్పెయిన్, బెల్జియంలో 43 శాతం మహిళా ప్రాతినిధ్యం ఉంది.
స్విట్జర్లాండ్‌లో 42%, ఆస్ట్రియా, నెదర్లాండ్స్‌లో 41%, ఫ్రాన్స్, పోర్చుగల్‌లో 37% మహిళా నేతలున్నారు.
జర్మనీ, బ్రిటన్‌లో 35%, ఇటలీలో 32%, కెనడాలో 30%, అమెరికాలో 29%, ఈజిప్ట్‌లో 28% మహిళా ప్రాతినిధ్యం ఉంది.
చైనాలో 25%, బంగ్లాదేశ్‌లో 21%, పాకిస్థాన్‌లో 20%, బ్రెజిల్‌లో 18% ఉన్నారు.
భారత పార్లమెంట్‌లో మహిళల ప్రాతినిధ్యం 15 శాతంగా ఉంది. ఈ విషయంలో బంగ్లాదేశ్, పాకిస్థాన్ కంటే భారత్ వెనకబడి ఉంది.
More
Stories
కోహ్లీ జట్టు ఈ సారి కూడా కప్పు గెలవదంట..
మహేంద్రుడి విశ్వరూపం
ఐపీఎల్ 2024లో కొత్త రూల్స్..