జపాన్ మగువల బ్యూటీ సీక్రెట్స్ ఇవే!
జపాన్ మహిళలు
ముసలివాళ్లైనా
, యువతుల లాగానే కనిపిస్తారు. కారణం వారి ప్రత్యేక జీవన శైలి.
జపాన్ మహిళలు అంత అందంగా ఉండటానికి ప్రధాన కారణం వారు గ్రీన్ టీ తాగడమే. వారు అతిథులకి ముందుగా ఇచ్చేది గ్రీన్ టీనే.
యాంటీ ఆక్సిడెంట్లను అధికంగా ఇస్తూ బరువును తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుంది గ్రీన్ టీ. ఫలితంగా వయసు కనిపించదు.
జపాన్ ప్రజలు పులియబెట్టిన ఆహారం తీసుకుంటారు. ఇందులో ఎక్కువ పోషకాలు, ఖనిజాలు, ప్రోటీన్లు ఉంటాయి.
పులియబెట్టిన ఆహారం జీర్ణక్రియను సరిచేసి, అధిక బరువు తగ్గిస్తుంది. చర్మ, పొట్టలో వచ్చే వ్యాధుల నుంచి కాపాడుతుంది.
జపాన్ వాసులు ఎక్కువగా సముద్ర ఆహారం తీసుకుంటారు. ఫలితంగా ప్రోటీన్లు, ఓమేగా-3 ఇతర పోషకాలు లభిస్తాయి.
సీ ఫుడ్ వల్ల ఉబకాయం, ఉబ్బరం, కొలెస్ట్రాల్ వంటివి తగ్గుతాయి. శరీరంలో కొవ్వు తగ్గి, మొహంలో కళ పెరుగుతుంది.
మితంగా తినడం కూడా జపాన్ వాసుల ఫుడ్ కల్చర్లో ప్రధాన అంశం వీళ్లు మంచి ఆహారం తీసుకుంటారు.
రైస్‌ను చిన్న గిన్నెల్లో తింటారు. గిన్నెలో కొద్దిగా వేసుకోగానే నిండినట్లు కనిపిస్తుంది.
జపాన్ ప్రజలు రోజూ నడుస్తారు. సైక్లింగ్ చేస్తారు. ఫలితంగా గుండె సంబంధిత సమస్యలు రావు. శరీరం ఫిట్‌గా ఉంటుంది.
జపాన్ ప్రజలు టైమ్ ప్రకారం తింటారు. సంప్రదాయ ఆహారాన్నే తింటారు. పిజ్జాలు, బర్గర్ల జోలికి దాదాపు వెళ్లరు.
తినేటప్పుడు టీవీ, మొబైల్ వంటివి చూడరు. నేలపై పీట వేసుకొని, దానిపై కూర్చొని తింటారు. అదీ ఒకరకమైన వ్యాయామమే.
More
Stories
శివుడి పూజా విధానం
ఏ పాము ఎలాంటిది?
యాపిల్, అల్లం టీ