ఈ 7 ఆహారాలతో కొలెస్ట్రాల్‌కి చెక్!
కొలెస్ట్రాల్‌లో HDL, LDL అనే రెండు రకాలు ఉంటాయి.
HDL కొలెస్ట్రాల్ మంచిది, LDL కొలెస్ట్రాల్ చెడ్డది.
మన శరీరంలో HDL పెంచుకొని, LDL తగ్గించుకోవాలి.
LDL తగ్గితే గుండెకు మంచిది. మరి దాన్ని తగ్గించే 7 ఆహారాలేవో తెలుసుకుందాం.
ఓట్స్‌లో బీటా గ్లూకాన్స్ ఉంటాయి. ఇవి చెడు LDL కొలెస్ట్రాల్ తగ్గిస్తాయి. గుండెను కాపాడతాయి.
ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉండే సాల్మన్ లాంటి చేపలు కూడా కొలెస్ట్రాల్ తగ్గేలా చేస్తాయి.
బాదాం, వాల్‌నట్స్, పిస్తా వంటి నట్స్.. మంచి కొలెస్ట్రాల్ పెరిగేలా చేస్తాయి. గుండెకు మేలు చేస్తాయి.
ఆవాకాడోలో మోనోశాచురేటెడ్ ఫ్యా్ట్స్ ఉంటాయి. ఇవి కొలెస్ట్రాల్ తగ్గించి, గుండె ఆరోగ్యాన్ని పెంచుతాయి.
బ్లూబెర్రీస్ వంటి బెర్రీస్‌లో యాంటీఆక్సిడెంట్స్ ఎక్కువ. ఇవి కొలెస్ట్రాల్ పెరగకుండా చేస్తాయి.
వెల్లుల్లిలో అల్లిసిన్ ఉంటుంది. ఇది కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది. ఆహారంలో వాడితే గుండెకూ మంచిదే.
గ్రీన్ టీలోని పాలీఫెనాల్స్ చెడు కొలెస్ట్రాల్ తగ్గేలా చేస్తాయి. గుండె ఆరోగ్యాన్ని ఇంప్రూవ్ చేస్తాయి.
More
Stories
వీళ్లు వజ్రాలు ధరించకూడదు
వుడ్ పెయింట్స్ అంటే ఏంటి?
ఇల్లు అమ్మేందుకు వాస్తు