గుండె బలం కోసం తినాల్సిన సూపర్ ఫుడ్స్..

ప్రపంచవ్యాప్తంగా సంభవించే మరణాలకు గుండె సమస్యలు ప్రధాన కారణం. 

ప్లాంట్‌ బేస్డ్‌ డైట్‌ గుండె జబ్బులు ముప్పును తగిస్తాయి.

మీ గుండె ఆరోగ్యాన్ని రక్షించుకోవడానికి ఎలాంటి ఆహారం తీసుకోవాలో ఓ లుక్కేద్దాం.

కూరగాయలు, ఆకుకూరలు.. తాజా కూరగాయలు, ఆకుకూరలు గుండె ఆరోగ్యాన్ని రక్షించడానికి సహాయపడతాయి. 

కాలే, పాలకూర.. కాలే, పాలకూర వంటి ఆకుకూరల్లో ఫైబర్‌ మెండుగా ఉంటుంది, ఇది కొలెస్ట్రాల్‌ స్థాయిలను తగ్గిస్తాయి. 

బెర్రీస్.. బెర్రీస్‌ గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి. 

ఓట్స్.. మీ ఆహారంలో ఓట్స్ చేర్చుకోవడం వల్ల గుండె జబ్బులకు ప్రధాన ప్రమాద కారకం అయిన చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించవచ్చు.

పప్పుధాన్యాలు, చిక్కుళ్లు.. చిక్కుళ్లలోని ఫైబర్‌ కొలెస్ట్రాల్‌, అధిక బరువును నియంత్రణలో ఉంచుతాయి. దీంతో గుండె సమస్యల ముప్పు తగ్గుతుంది. 

అవకాడో.. ఇది చెడు కొలెస్ట్రాల్‌ను కరిగిస్తుంది. అవకాడో తరచుగా తీసుకుంటే.. గుండె ప్రమాదాల ముప్పు తగ్గించుకోవచ్చు.

గమనిక.. ఇది సోషల్ సమాచారం మాత్రమే. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి.