భారీగా తగ్గిన బంగారం ధర.. ఇప్పుడు కొనొచ్చా? 

బంగారం ధరలు బాగా దిగొచ్చాయి

కేంద్ర బడ్జెట్ సెషన్ తర్వాత గోల్డ్ రేటు భారీగా పడిపోయింది 

బంగారం, వెండిపై కస్టమ్స్ సుంకాన్ని తగ్గించడమే ఇందుకు కారణం 

బంగారం, వెండిపై కస్టమ్స్ డ్యూటీ 6 శాతానికి కుదించారు 

దీంతో బంగారం ధరలు దెబ్బకు దిగొచ్చాయి 

గత వారం రోజుల్లో 5 వేలకు పైగా తగ్గింది గోల్డ్ రేటు 

నేడు  22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.64 వేలకు చేరుకుంది

24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.69,820కి తగ్గింది 

ఈ రేట్లలో గోల్డ్ కొనొచ్చని నిపుణులు చెబుతున్నారు 

తక్కువ ధరలో డిమాండ్ పెరుగుతుందని అంచనా వేస్తున్నారు

రానున్న రోజుల్లో గోల్డ్ రేట్లు మళ్ళీ జంప్ కావొచ్చని అంటున్నారు